
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం… “గేమ్ ఛేంజర్”. ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ దర్శకుడు అనిపించుకున్న శంకర్ తీస్తున్న మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ సినిమా షూటింగ్ రెండేళ్లుగా సాగుతోంది. దాంతో, ఈ సినిమాకి లీకుల బెడద ఎక్కువైంది.
తాజాగా ఒక పాట లీక్ అయింది. “జరగండి జరగండి జాబిలమ్మా జాకెటేసుకుని వచ్చేనండీ … జరగండి జరగండి ప్యారడైస్ పావడా వేసికొనొచ్చేనండి” అంటూ సాగే ఈ పాటని తమన్ స్వరపరిచారు. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే పాట ఇది. పాట మరీ సాధారణంగా ఉంది. శంకర్ స్థాయిలో లేదు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి.
“జాబిలమ్మా జాకెటేసుకుని వచ్చే” వంటి పదాలు కియారా అందం గురించి అన్నమాట. కియారా అందం గురించి కుర్రకారుకు బాగా తెలుసు. ఇక హీరోయిన్ల అందాలను అద్భుతంగా ప్రెజెంట్ చేస్తాడని పేరున్న శంకర్ ఈ జాకెటేసుకున్న జాబిలమ్మని ఎంత గొప్పగా చూపిస్తారో చూడాలి.
రామ్ చరణ్, కియారా కలిసి నటించడం ఇది రెండోసారి.