కియరా: అదే భయంకరమైంది

Kiara Advani

లాక్ డౌన్ తర్వాత దాదాపు హీరోయిన్లంతా సెట్స్ పైకి వచ్చేశారు. హీరోయిన్ కియరా కూడా షూటింగ్స్ స్టార్ట్ చేసింది. లాక్ డౌన్ తర్వాత సరికొత్త జాగ్రత్తలతో సెట్స్ పైకి రావడం చాలా హ్యాపీగా, ఇంకాస్త టెన్షన్ గా ఉందంటోంది కియరా అద్వానీ. అయితే “భయం” అనేది కరోనా కంటే అతి భయంకరమైనదని అభిప్రాయపడింది.

సరైన జాగ్రత్తలు తీసుకొని బయటకు రావడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని విధాలుగా మంచిదని చెబుతున్న ఈ ముద్దుగుమ్మ.. తన చేతిలో ఉన్న 2 సినిమాల్ని తాజాగా పూర్తిచేసినట్టు వెల్లడించింది. “ఇందూకీ జవానీ” అనే సినిమాకు సంబంధించి సాంగ్ షూట్ పూర్తిచేసింది. “లక్ష్మి” మూవీకి సంబంధించి ఒక చిన్న సీన్ కంప్లీట్ చేసింది. దీంతోపాటు కొన్ని బ్రాండ్ షూటింగ్స్ కూడా కంప్లీట్ చేసినట్టు తెలిపింది.

అయితే కొత్తగా ఒప్పుకున్న సినిమాలేవీ ఇంకా స్టార్ట్ కాలేదంటోంది కియరా. “భూల్ బులయా-2″లో నటించేందుకు ఒప్పుకున్నానని, ఆ ప్రాజెక్టు జనవరి నుంచి సెట్స్ పైకి వస్తుందని అంటోంది. తెలుగు సినిమాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంట.

Related Stories