కియారా…ఇదేమి యాక్టింగ్?

Kiara Advani

అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా రాఘవ లారెన్స్ తీసిన చిత్రం… లక్ష్మి. “కాంచన” సినిమాకిది హిందీ రీమేక్. ఈ సినిమాతో హిందీలోకి అడుగుపెట్టాడు డైరెక్టర్ లారెన్స్. డైరెక్ట్ గా హాట్ స్టార్ లో విడుదలయింది.

“కాంచన” కథే సిల్లీ. కోవై సరళ, దేవదర్శిని, లారెన్స్ మధ్య పండిన కామెడీ వల్ల ఆ సినిమా ఆడింది. ఐతే, హిందీలో ఆ పాత్రలు లేవు. లారెన్స్ తల్లి పాత్ర అత్తగా మారింది హిందీలో. లారెన్స్ వదిన పాత్ర… కియారా వదినగా మారింది. ఐతే, బాలీవుడ్ లో కూడా ఈ అత్త, వదినలతో అదే కామెడి పండించే ప్రయత్నం చేశాడు లారెన్స్.

కానీ హిందీ వర్షన్ లో కామెడి పేలవంగా ఉంది. సినిమా అంతకన్నా ఘోరంగా ఉంది. టోటల్ గా బోర్.

ఐతే, ఈ సినిమాలో ముఖ్యంగా కియారా పాత్రని చూస్తే జాలి వేస్తుంది. ఆమె రోల్… జూనియర్ ఆర్టిస్ట్ కున్నంత లెంగ్త్ కూడా లేదు. ఇక కియారా నటన చూస్తే… ఏంటి ఆమెకి బేసిక్ ఎక్స్ ప్రెషన్స్ కూడా రావా అన్న అనుమానం వస్తుంది. చాలా అమెచ్యూరిష్ గా ఉంది ఆమె నటన.

Related Stories