కియరా కోసం సల్మాన్ సలహాలు

- Advertisement -
Kiara Advani

ఇచ్చే సలహాలు, చెప్పే సూచనలు చిన్నవే కావొచ్చు. కానీ అవి ఎవరు ఇచ్చారనేది ఇంపార్టెంట్. ఇదే విషయాన్ని చెబుతోంది హీరోయిన్ కియరా అద్వానీ. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఓ సలహా, తనను ఎప్పుడూ ముందుండి నడిపిస్తుందని అంటోంది ఈ బ్యూటీ.

ఇంతకీ సల్మాన్ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా.. వెరీ సింపుల్.. “కష్టపడి పనిచెయ్, ఫలితం ఆశించకు. నీ కృషే నిన్ను కాపాడుతుంది” చెప్పుకోడానికి సినిమా డైలాగ్ లా ఉన్నప్పటికీ సల్మాన్ చెప్పడంతో దానికి వాల్యూ యాడ్ అయింది. ఎప్పుడా సల్మాన్ సలహాను గుర్తుచేసుకుంటానని చెబుతోంది కియారా.

అంతేకాదు.. కియారాకు పేరు మార్చుకోమని సూచించింది కూడా సల్మాన్ ఖానే అంట. కియరా అసలు పేరు అది కాదు. ఆమె ఒరిజినల్ నేమ్ ఆలియా అద్వానీ. ఆల్రెడీ ఇండస్ట్రీలో అలియా భట్ ఉంది కాబట్టి.. ఆలియా అనే పేరుతో చలామణి అవ్వడం కరెక్ట్ కాదని సల్మాన్ చెప్పాడట.

తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించింది కియారా. బాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద హీరోయిన్ గా స్థిరపడింది.

More

Related Stories