కియారాకి మరో బంపర్ ఆఫర్!

- Advertisement -
Kiara Advani

కియారా అద్వానీ ఇక టాలీవుడ్ కి వచ్చేలా లేదు. ఆమెకి బాలీవుడ్ లో వరుసగా పెద్ద పెద్ద సినిమాలు వరిస్తున్నాయి. ఇప్పటికే అక్షయ్ కుమార్ వంటి పెద్ద హీరో సరసన నటించిన ఈ సుందరి ఇప్పుడు ఏకంగా హృతిక్ రోషన్ తో ఆటాపాటా ఆడేందుకు రెడీ అవుతోంది.

హృతిక్ రోషన్ హీరోగా ఆయన తండ్రి రాకేష్ రోషన్ “క్రిష్ 4” అనౌన్స్ చేసాడు. ఈ సినిమాలో మొదట కృతి సనాన్ ని అప్రోచ్ అయ్యారు. కానీ ఆ భామ ఇప్పటికే ఐదు కొత్త సినిమాలు సైన్ చేసింది. ఆమె డేట్స్ దొరకడం కష్టమే. అందుకే, కియారాని లాక్ చేసే ఆలోచనలో ఉన్నారట.

నిజానికి “క్రిష్ 4” సినిమాని ఇప్పటికే మొదలు పెట్టాలనుకున్నారు. కానీ కరోనా సంక్షోభం కారణంగా వాయిదాపడింది. 2021లో స్టార్ట్ చేస్తున్నారు. “వార్” సినిమాతో బాక్సాఫిస్ ని షేక్ చేసిన హృతిక్ రోషన్ ఇప్పుడు “క్రిష్ 4″తో మరో బ్లాక్ బస్టర్ డెలివరీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు.

కియారా అద్వానీకి ఇది పెద్ద బూస్ట్. ఆమె ఇక పూర్తిగా టాప్ లీగ్ లోకి వెళ్తుంది.

 

More

Related Stories