పెళ్లి ఆలోచన లేదు కానీ…!

- Advertisement -

సెలెబ్రిటీ ప్రపంచంలో కొత్త ప్రేమపక్షులు… కిమ్ శర్మ, లియాండర్ పేస్. టెన్నిస్ దిగ్గజం లియాండర్ భార్య నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. కిమ్ శర్మ కూడా నాలుగేళ్ళ క్రితమే భర్త నుంచి విడిపొయింది. ఒక తెలుగు హీరోతో కొన్నాళ్ళు డేటింగ్ చేసింది. కానీ అది కొంతకాలమే నిలిచింది. ఇప్పుడు లియాండర్ కి మనసిచ్చింది.

లియాండర్ కి 48. కిమ్ శర్మకి 41. మరి వీరు పెళ్లి చేసుకుంటారా? అలాంటిదేమి లేదంట. లవ్ బర్డ్స్ గానే స్వేచ్ఛగా విహరిస్తాం అని హింట్ ఇస్తోంది కిమ్ శర్మ.

వీరిద్దరూ ఆ మధ్య గోవా బీచుల్లో ఆలింగనాలూ, చుంభనలూ చేసుకొంటూ కెమెరా కంటికి చిక్కారు. కానీ ఇప్పుడు కిమ్ శర్మ స్వయంగా ఈ ఫోటోని షేర్ చేసింది. ఇక, మీడియా ‘గాసిప్’లు రాయకుండా తమ గురించి డైరెక్ట్ గా రాయొచ్చని గ్రీన్ సిగ్నలు ఇచ్చింది.

 

More

Related Stories