ఓటీటీలో కిన్నెరసాని హంగామా

రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టిన జీ5, అదే ఊపులో మరో సినిమాను డైరక్ట్ రిలీజ్ చేయబోతోంది. ఆ సినిమా పేరు కిన్నెరసాని. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన ఈ సినిమాను 10వ తేదీన జీ5లో నేరుగా స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు.

ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది కిన్నెరసాని. ఈ సినిమాను అమ్మడానికి నిర్మాత రామ్ తళ్లూరి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరీ ముఖ్యంగా అతడికి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం ఇష్టం లేదు. దీంతో తన సినిమా కాపీ రైట్ హక్కుల్ని జీ గ్రూప్ కు ఇచ్చేశాడు.

కల్యాణ్ దేవ్ తాజా చిత్రం సూపర్ మచ్చి థియేటర్లలో పెద్దగా ఆడలేదు. సంక్రాంతి సీజన్ లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, మార్కెట్లో నిలబడలేకపోయింది. దీంతో అతడు నటించిన కిన్నెరసాని సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్మాత ఆసక్తి చూపించలేదు.

మూవీకి సంబంధించి తాజాగా ట్రయిలర్ రిలీజ్ చేశారు. ట్రయిలర్ చూస్తే ఇదొక మిస్టరీ థ్రిల్లర్ అని తెలుస్తోంది. వేద అనే అమ్మాయి తన తండ్రి కోసం వెదకడం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో కల్యాణ్ దేవ్ ఏం చేశాడనేది అసలు కథ.

 

More

Related Stories