
హీరోయిన్లు తమ అభిమానులతో చాట్ చేస్తున్నప్పుడు కొన్ని విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కొన్ని ఇబ్బందికర, అభ్యంతరకర ప్రశ్నలను చూసీచూడనట్లు వదిలేయక తప్పదు. ఐతే, కొందరు వాటినే పట్టుకొని… సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు.
కియారా లాంటి స్మార్ట్ హీరోయిన్స్ మాత్రం సమయస్ఫూర్తి ప్రదర్శించి అభిమానులతో లైకులు అందుకుంటారు.
రీసెంట్ గా కియారాని ఒక అభిమాని “గొప్ప సెక్స్” ఇష్టమా, ఇంకా ఏదైనా? అని అర్థంలో అడిగాడు. ఆమె తడుముకోకుండా “దానికన్నా పిజ్జా చాలా ఇష్టం,” అని చెప్పింది. అంతే, ఆమె సమాధానానికి లైకులు లైకులు.
కియారా అద్వానీ నటించిన బాలీవుడ్ మూవీ “లక్ష్మి” ఈ నెల 9న హాట్ స్టార్ లో విడుదల అవుతోంది. దాంతో అభిమానులతో ఇంటరాక్ట్ అయింది.”భరత్ అనే నేను”, “వినయ విధేయ రామ” చిత్రాల తర్వాత ఆమె తెలుగులో మరో సినిమా ఒప్పుకోలేదు. ప్రభాస్ సరసన “ఆదిపురుష్” సినిమాలో కియారా నటించే అవకాశం ఉందని ఆ మధ్య వినిపించింది. కానీ ఇప్పుడు ఆ పాత్ర కృతి సనాన్ కి వెళ్లే అవకాశం ఉందట.