కమర్షియల్ మీటర్లోకి కిరణ్!

ఎటువంటి అండ లేకుండా హీరోగా గురింపు తెచ్చుకున్న హీరో… కిరణ్ అబ్బవరం. ఈ రాయలసీమ కుర్రాడు ఇటీవలే “వినరో భాగ్యము విష్ణుకథ” సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు హీరోగా తనకంటూ కొంత బిజినెస్ ఉందని నిరూపించుకున్నాడు.

ఆ సినిమాకి ఓటిటి, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ వంటి ఇతరత్ర ఆదాయమే 13 కోట్లు వచింది. థియేట్రికల్ ఆదాయం అదనం. సో, హీరోగా నిలదొక్కుకున్నట్లే.

ఇప్పుడు కిరణ్ నటిస్తున్న తాజా చిత్రం… “మీటర్”. ఈ సినిమాతో అన్ని రకాల చిత్రాలు చెయ్యగలను అని నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘మీటర్’ మూవీ కూడా వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రమేనట. 10కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే మంచి బిజెనెస్ చేసుకుని మైత్రీ మూవీస్ కు లాభాలు తెచ్చిపెట్టింది.

“మీటర్” కూడా పెద్ద విజయం సాధిస్తే… కిరణ్ అబ్బవరం 20 కోట్ల మార్కెట్ హీరోగా మారతాడు.

 

More

Related Stories