కిరణ్ ఇప్పుడైనా తెలుసుకుంటాడా?

- Advertisement -
Kiran Abbavaram

యువ హీరోల్లో సీమ బాంబులా పేలిన హీరో కిరణ్ అబ్బవరం. ‘SR కల్యాణ మండపం’ బాగా ఆడడంతో తనికి క్రేజ్ ఉందని అనుకున్నాడు ఈ యువ హీరో. ఐతే, నేటి ప్రేక్షకులు వెరీ స్మార్ట్. కొంచెం ఓవర్ చేస్తే చాలు రిజెక్ట్ చేస్తారు.

కిరణ్ కాన్సెప్ట్ సినిమాలతో, పాత్రలకు తగ్గట్లుగా ఒదిగి చేస్తే అతనికి మంచి మార్కెట్ ఉండేది. కానీ, తన రేంజ్ కి మించిన పాత్రలు చేసి తొందర్లో ఒక రేంజ్ ఉన్న హీరో అనిపించుకుంద్దామనే ఆత్రంలో బోల్తా పడ్డాడు. మేటర్ లేకుండా మాస్ మీటర్ సెట్ చేద్దామని ప్రయత్నం చేశాడు కిరణ్ అబ్బవరం. కానీ, జనం థియేటర్ కి కిలోమీటర్ దూరంలోనే ఆగిపోయారు. ఈ మధ్య కాలంలో అత్యంత దారుణంగా ఫ్లాప్ అయిన చిత్రం… ‘మీటర్’.

మూస కథలను మాస్ కథలు అనుకోని ఏది పడితే అది, ఎవరూ పడితే వాళ్ళు చేస్తే జనం ఆదరిస్తారు అనుకోవడం భ్రమ. ఆ విషయం కిరణ్ ఇప్పుడైనా తెలుసుకుంటే తొందర్లో మళ్ళీ విజయాల బాట పడుతాడు.

యువ హీరోల నుంచి కొంతైన ప్రెష్ కథో, ఆకట్టుకొనే కథనమో జనం కోరుకుంటారు. మరి తన పంథా మార్చుకుంటాడా?

 

More

Related Stories