కిరణ్ అబ్బవరం “దిల్ రూబ”‌

- Advertisement -
Kiran Abbavaram

యువ హీరో కిరణ్ అబ్బవరం ఆ మధ్య వరుసగా సినిమాలు విడుదల చేశాడు. ఇప్పుడు కొంత స్లో అయ్యాడు. సినిమాల పంథా మార్చాలని గ్యాప్ తీసుకున్నాడు. ఒక మంచి హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు.

తాజాగా ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఓకె చేశాడు. ఈ సినిమాకి “దిల్ రూబ”‌ అనే పేరు ఖరారు చేశారు.

ప్రముఖ ఆడియో కంపెనీ సరేగమా, శివమ్స్ సెల్యులాయిడ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్ నటిస్తోంది .

కిరణ్ ఇంతకుముందు “రాజావారు రాణిగారు”, “రూల్స్ రంజన్”, “SR కల్యాణ మండపం”, “వినరో భాగ్యము విష్ణు కథ”, “సమ్మతమే” వంటి చిత్రాలు చేశాడు. మొదట్లో మంచి విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత విజయాల శాతం తగ్గింది. అందుకే కొత్త ఏడాదిలో సరికొత్తగా మనముందుకు రానున్నాడు.

 

More

Related Stories