భారీ లైనెప్ తో కిరణ్

“రాజా వారు రాణి గారు” సినిమాతో అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం తక్కువ టైంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది విడుదలైన “ఎస్.ఆర్. కల్యాణ మండపం” అతన్ని విజయవంతమైన హీరోగా నిలబెట్టింది.

“సెబాస్టియన్ పిసి 524”, “సమ్మతమే” సినిమాలు పెద్దగా ఆడకపోయినా అతనిలోని వైవిధ్యాన్ని చూపాయి. కానీ, ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన “నేను మీకు బాగా కావాల్సినవాడిని” డిజాస్టర్‌గా నిలిచి అతని కెరీర్ కి పెద్ద సమస్యలు సృష్టించింది.

అతని చేతిలో చాలా చిత్రాలున్నాయి. కానీ, బాగా ట్రోలింగ్ కి గురి అయ్యాడు. అందుకే, ఇప్పుడు మళ్ళీ తనని తాను నిరూపించుకోవాల్సిన స్థితిలోకి నెట్టివేయబడ్డాడు. ఐతే, అతనికున్న క్రేజ్ తగ్గలేదు అని చెప్పొచ్చు. తాజాగా కొన్ని బ్రాండ్స్ కూడా అంబాసిడర్ గా ఉండమని వచ్చాయట.

ఇక 2023లో పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గీతా ఆర్ట్స్, మైత్రాయ మూవీ మూవీ మేకర్స్, ఏషియన్ మూవీస్ వంటి పెద్ద సంస్థలు నిర్మిస్తున్న సినిమాలే ఇవి. సో, 2023 సంత్సరంలో భారీ లైనప్ రెడీ చేశాడు ఈ యంగ్ హీరో.

ఫిబ్రవరి 17, 2023న మహాశివరాత్రినాడు “వినరో భాగ్యము విష్ణు కథ” విడుదల కానుంది. ఆ తర్వాత వరుసగా ఇతర సినిమాలు వస్తాయి.

 

More

Related Stories