కిరణ్ అబ్బవరానికి మరో హిట్?

VBVK

‘వినరో భాగ్యము విష్ణు కథ’పై కిరణ్ అబ్బవరం చాలా ఆశలు పెట్టుకున్నాడు. పెద్ద నిర్మాణ సంస్థ అండతో ఈసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు కిరణ్. గతంలో భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, వంటి హిట్ సినిమాలు తీసిన సంస్థ ‘GA 2 పిక్షర్స్’ నిర్మించిన సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లే ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.

ఫిబ్రవరి 18న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు 2.75 కోట్ల గ్రాస్ ను, రెండవరోజు 2.40 కోట్ల గ్రాస్ ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 5.15 కోట్ల గ్రాస్ ను సాధించడం విశేషం. కిరణ్ కి ఇది మంచి కలెక్షన్.

మరో 15 రోజుల వరకు కొత్త సినిమాల పోటీ ఉండదు. సో, ఈ సినిమా వసూళ్లు సాధించడానికి మంచి స్కోప్ ఉంది.

ఈ వారం గట్టిగా ఆడితే, కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడినట్లు అవుతుంది. ప్రస్తుతం ఐతే సాలిడ్ ఓపెనింగ్స్ సాధించింది.

 

More

Related Stories