సాయితేజ్ ఇప్పుడు ఇలా ఉన్నాడు

Sai Tej and Kishan Reddy


రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత హీరో సాయి తేజ్ ఇప్పటివరకు బయటికి అడుగుపెట్టలేదు. మెగా ఫ్యామిలీ షేర్ చేసిన ఫొటోల్లో అతను కనిపించిన మాట నిజమే. కానీ అందులో సాయి ధరమ్ తేజ్ ముఖం క్లోజప్ లో కనిపించలేదు. దాంతో… సాయి తేజ్ పూర్తిగా కోలుకున్నాడా లేదా అన్న డౌట్స్ చాలా మందిలో మెదిలాయి.

కొన్ని పుకార్లు కూడా షికారు చేశాయి. అన్నిటికి ఫుల్ స్టాప్ పడింది తాజా ఫొటోలతో.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు సాయితేజ్ ఇంటికి వెళ్లి పలకరించారు. ఆ తర్వాత వచ్చిన ఫొటోల్లో సాయి తేజ్ పూర్తిగా హెల్తీగా కనిపిస్తున్నారు. గొంతువద్ద సర్జరీ చారికలు మినహా సాయి తేజ్ పర్ఫెక్ట్ గానే ఉన్నారు.

సాయి తేజ్ మరో రెండు నెలల్లో షూటింగ్ లు కూడా మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. యాక్సిడెంట్ కి ముందే ఒక సినిమా షూటింగ్ మొదలైంది. ఆ సినిమాని ముందుగా ప్రారంభిస్తాడట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నిర్మించే ఒక చిత్రంలోనూ, సంపత్ నంది తీసే సినిమాలో నటించే అవకాశం ఉంది.

 

More

Related Stories