- Advertisement -

నాగశౌర్య ఈ నెల 20న పెళ్లి చేసుకోబుతున్నాడు. ఈ విషయాన్ని అతని టీం వెల్లడించింది. ఆమె పేరు అనూష అని మాత్రమే తెలిపింది. ఇంతకీ ఈ అనూష ఎవరు అని ఆరా తీస్తే…
ఆమె పేరు అనూష ఎన్ శెట్టి. ఆమె ఒక పెద్ద ఇంటీరియర్ కంపెనీకి అధినేత్రి. అనూష డిజైన్స్ పేరుతో బెంగుళూరులో ఆమె ఇంటీరియర్ కంపెనీ నడుపుతోంది. విలాసవంతమైన విల్లాలు, అపార్టుమెంట్లు, ఆఫీసులకు ఆమె ఇంటీరియర్ అందిస్తారు. ఆమె క్లయింట్లు అందరూ సూపర్ రిచ్.
చాలా కాలంగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతోందట. నాగబాబు కూతురు నిహారికతో బ్రేకప్ అయ్యాక అనూష పరిచయం జరిగినట్లు ఇన్ సైడ్ టాక్. ఆ తర్వాత అది ప్రణయంగా మారి ఇప్పుడు పరిణయానికి దారితీసింది.
ALSO READ: Naga Shaurya to tie the knot on November 20
నాగశౌర్య, అనూషల పెళ్లి కూడా బెంగుళూరులోనే జరగనుంది.