
సునీతకి వయసు ఎంత? ఆమెకి అంత పెద్ద పిల్లలు ఉన్నారు, ఇప్పుడు రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటోంది? వంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. రామ్ సూరపనేని అనే ఒక డిజిటల్ మీడియా కంపెనీ ఓనర్ తో ఆమెకి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే పెళ్లి. ఇద్దరికీ ఇది రెండో వివాహమే. ఐతే, ఆమె ఎదిగిన పిల్లలను చూసి సునీత కూడా సంతూర్ మమ్మీనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సునీత వయసు 43. అవును ఆమెకికా నలబై మూడే. సునీతది గుంటూరు. ఇంటర్ చదువుతున్న టైంలోనే ఆమెకి సినిమా పాట పాడే అవకాశం వచ్చింది. 1995లో “గులాబీ” సినిమా కోసం “ఈ వేళలో ఏమి చేస్తూ ఉంటావో” పాట పాడింది. ఆ తర్వాత రెండేళ్లకే కిరణ్ కుమార్ తో పెళ్లి అయింది. వెంటనే పిల్లలు…
సునీతకి మొదటి భర్త వల్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఆకాష్, కూతురు శ్రేయ…పెద్దవాళ్లయ్యారు. కొడుకు ఆకాష్ అమెరికాలో చదువుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలోని ఒక MNCలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు శ్రేయ చదువు ఇంకా పూర్తి కాలేదు కానీ అప్పుడే సినిమాల్లో పాట కూడా పాడింది. కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ లో ఆమె ఇటీవలే ఒక సాంగ్ రెకార్డ్ చేసింది. ఆమె కూడా సెటిల్ అయినట్లే.

పిల్లలు ఇద్దరూ సెటిల్ కావడంతోనే… మళ్ళీ పెళ్లి చేసుకోవాలని సునీత నిర్ణయించుకుందట.
పదేళ్ల క్రితమే మొదటి భర్త కిరణ్ కి దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. టీనేజ్ లోనే పిళ్లి కావడం వల్లే ఆమెకి ఇప్పుడు 20 ప్లస్ ఏజ్ పిల్లలు ఉన్నారు.