‘కొరమీను’ మోషన్ పోస్టర్‌ విడుదల

జాలరిపేట నేపధ్యంలో సాగే చిత్రం ‘కొరమీను’. ఆనంద్ రవి హీరోగా నటిస్తున్న మూవీ ఇది. హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోర్ ధాత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మించారు. ఈ “కోరమీను” మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా హీరోయిన్ లావణ్య త్రిపాఠి విడుదల చేశారు.

ఒక బోట్ పై ‘మీసాల రాజ్ మీసాలు ఎవరో కత్తిరించారా! ఎందుకు?’ అంటూ పోస్టర్‌లోని BGM, సెట్టింగ్ మరియు పోస్టర్ చూస్తుంటే ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తుంది.

ఈ సందర్బంగా దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ..మా చిత్ర మోషన్ పోస్టర్ ను లావణ్య త్రిపాటి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథ విషయానికి వస్తే జాలారిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో సాగే కథ ఇది. .సరదా-ప్రేమగల డ్రైవర్, అతని యజమాని అయిన అహంకారి ధనవంతుడు మరియు వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు ఇలా మూడు ముఖ్యమైన పాత్రలతో మంచి కంటెంట్ తో వస్తున్న “కొరమీను” అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

Korameenu First Look Motion Poster | Anand Ravi | Harish Uthaman | Kishori Dhatrak | Sripathy Karri
 

More

Related Stories