ఆచార్య రిలీజ్ వరకు అంతే!

- Advertisement -
Koratala Siva


మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు కొరటాల శివ తీసిన ‘ఆచార్య’ సినిమా పూర్తయి చాలా కాలమే అయింది. ఐతే, ఈ సినిమా విడుదల మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఏప్రిల్ 29కి ల్యాండ్ అయింది. దాంతో, ఎన్టీఆర్ తో మొదలుపెట్టాల్సిన సినిమా షూటింగ్ కూడా వాయిదా వేసుకున్నారు దర్శకుడు కొరటాల.

ఇంతకుముందు ఈ సినిమాని ఫిబ్రవరిలోనే లాంఛనంగా లాంచ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ, ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల వరకు అలాంటివి ఏవీ పెట్టుకోవద్దని ఎన్టీఆర్ కోరడంతో ప్రారంభోత్సవాన్ని పక్కన పెట్టారు. ‘ఆర్ ఆర్ ఆర్’ ఈ నెల 25న విడుదల కానుంది. ఇటు, ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల, అటు ‘ఆచార్య విడుదల ఒక నెల గ్యాప్ లో జరిగిపోతాయి. అందుకే, తమ కొత్త సినిమాని మేలో కానీ, జూన్ లో కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుదామని భావిస్తున్నారు కొరటాల.

వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు ‘జనతా గ్యారేజ్’ వచ్చింది. అది హిట్. ఇప్పుడు ఈ సినిమా కూడా దానికి మించేలా ఉంటుందట. కుదిరితే పాన్ ఇండియా లెవల్లోనే తీస్తారు. ‘ఆర్ ఆర్ ఆర్’కి హిందీలో వచ్చే క్రేజ్ ని బట్టి ఎలా చెయ్యాలని అనేది డిసైడ్ చేస్తారట.

ఎన్టీఆర్ సరసన ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.

 

More

Related Stories