
అల్లు అర్జున్ – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందాల్సిన సినిమా ఆగిపోయింది. ఆ సినిమాని వదిలేసి ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని టేకప్ చేశారు కొరటాల శివ. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ఉంటుంది కొరటాల శివ – ఎన్టీఆర్ చిత్రం.
ఐతే, అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేసి, ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టి ఎన్టీఆర్ సినిమా చేపట్టడంతో అప్పట్లో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేశారు. కొరటాలని ట్రోల్ చేశారు.
కానీ నిన్న ‘పుష్ప’ సినిమాకి ఆయనే ముఖ్య అతిథిగా వచ్చారు. అంతేకాదు, ‘పుష్ప 2’ తర్వాత బన్నీతో తన చిత్రముంటుందని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. సో… ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ కూడా హ్యాపీనే.
అల్లు అర్జున్ వెంటనే ‘పుష్ప 2’ మొదలు పెడుతారా? లేదా బోయపాటి డైరెక్షన్ లో ఒక మూవీ పూర్తి చేసి ‘పుష్ప 2’ చేస్తారా అనేది చూడాలి. ‘పుష్ప’ ఇతర భాషల్లో ఎలా ఆడుతుంది అన్న దాన్ని బట్టి అల్లు అర్జున్ నిర్ణయం ఉంటుంది అనుకోవచ్చు.