ఊపిరి పీల్చుకున్న కొరటాల

Koratala Siva

మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది అన్న వార్తతో అగ్ర దర్శకుడు కొరటాల శివ డీలాపడిపోయాడు. “ఆచార్య” సినిమా షూటింగ్ కి ఇన్ని అడ్డంకులా, ఎందుకిలా జరుగుతోంది అని తన సన్నిహితుల వద్ద వాపోయాడు. కానీ నాలుగు రోజుల్లోనే ఆయనకి ఖుషీ కలిగించే కబురు వచ్చింది. చిరంజీవికి కరోనా సోకలేదు. ఒక తప్పుడు కిట్ వల్ల చేసిన పరీక్షతో ఆయన కరోనా వచ్చినట్లు పొరపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన నార్మల్ గానే ఉన్నారు అని తేలడంతో కొరటాల ఎగిరి గంతులెయ్యడం ఒక్కటే చెయ్యలేదు. కానీ ఆ రేంజులోనే ఆనందపడిపోయాడు.

ఇక షూటింగ్ యధావిధిగానే సాగుతుంది.

ముందు అనుకున్నట్లు “ఆచార్య” ఏప్రిల్ 10, 2021న విడుదల అవుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం. ఐతే, షూటింగ్ సాఫీగా సాగితే, మరో నాలుగు నెలల్లో షూటింగ్ పార్ట్ అయితే పూర్తి చెయ్యగలడు కొరటాల. ఈ సినిమా షూటింగ్ కి చిరంజీవితో పాటు కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ కూడా రావాలి. కాజల్ అగర్వాల్ త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అవుతుంది.

రామ్ చరణ్ 30 నిమిషాల పాటు ఉండే లెంగ్తీ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. చరణ్ కి హీరోయిన్ ని ఇంకా ఫిక్స్ చెయ్యలేదు. చరణ్ ఎప్పుడు షూటింగ్ లో చేరుతాడో చూడాలి.

Related Stories