కొరటాల పనికి కత్తిరింపులు!

కొరటాల శివ దర్శకుడే కాదు సినిమా ప్రొడక్షన్ లో కూడా పాల్గొంటారు. వ్యాపార లావాదేవీల్లో భాగం ఉంటుంది. ఐతే, ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నప్పుడే ఏమి చేసినా చెల్లుతుంది. ఫ్లాప్ వస్తే ‘ఎక్స్ట్రాలు వద్దు’ అని బ్లంట్ గా చెప్పేస్తారు.

శివ కొరటాల విషయంలో అదే జరిగింది. ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ వంటి చిత్రాల్లో శివ కొరటాల వ్యాపారంలో కూడా కలగచేసుకొని హడావిడి చేశారు. ‘ఆచార్య’లో సినిమా మేకింగ్ పక్కన పెట్టి బిజినెస్ లెక్కలలో ఎక్కువ తలమునకలై మునిగిపోయారు. ఆ సినిమా నష్టాలు తీర్చేందుకు ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది. అందుకే, ‘ఎన్టీఆర్ 30’ విషయంలో ఇవన్నీ ఉండకుండా చేసినట్లు టాక్.

‘ఎన్టీఆర్ 30’ దర్శకుడి శివ కొరటాల తీసే కొత్త చిత్రం. ఇది ఎన్టీఆర్ కి 30వ చిత్రం వచ్చే నెల షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమా స్టోరీ, డైరెక్క్షన్ కి మాత్రమే ఆయన పరిమితం అవుతారు. నిర్మాణం, వ్యాపార లావాదేవీలు ఆయన మిత్రుడు సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ చూసుకుంటారు.

ఈ సినిమా కథ, కథనాల విషయంలో కొరటాల శివ చాలా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘ఆచార్య’ ఆయన గ్రాఫ్ ని బాగా పడేసింది. అందుకే, ఇప్పుడు ఎక్స్ట్రా కేర్ ఫుల్ గా ఉంటున్నారు.

 

More

Related Stories