- Advertisement -

మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న హీరోలుగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం… ‘కోతి కొమ్మచ్చి’. ఈ సినిమా విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
“నవంబర్ 3 నుండి అమలాపురంలో షూటింగ్ మొదలు పెడతాము. ఆ తర్వాత వైజాగ్ లో కొంత పార్ట్ షూట్ చేయబోతున్నాము. ఒకే షెడ్యుల్ లో సినిమాను పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాము,” అని తెలిపారు దర్శకుడు వేగేశ్న సతీష్.
రిద్ది కుమార్ , మేఘ చౌధురి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనుప్ రుబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.