10 కోట్ల బకాయిలు…అందుకే చిక్కులు

2021లో తొలి సినిమాగా, రవితేజ కెరీర్లోనే ఎక్కువ సంఖ్యలో థియేటర్లు పొందిన సినిమాగా ప్రచారం అందుకున్న సినిమా “క్రాక్”. కానీ నిర్మాత చేసిన మిస్టేక్ తో ఈ పాజిటివ్ ప్రచారం అంతా హుష్ కాకి అయింది. ఒకవిధంగా రవితేజ ఇమేజ్ కి ఇది దెబ్బే. అసలే ఫ్లాపుల్లో ఉన్న హీరో అతను.

క్రాక్ సినిమా ఉదయం ఆటలు పడలేదు. మార్నింగ్ టికెట్లు కొన్న వారందరికి సినిమాలేదు అని చెప్పారు థియేటర్ల యాజమాన్యాలు.

నిర్మాత మధుసూదన్ రెడ్డి ఉరఫ్ ఠాగూర్ మధు తమిళంలో విశాల్ హీరోగా టెంపర్ సినిమాని రీమేక్ చేశాడు. “అయోగ్య” అనే పేరుతో తీసిన ఆ మూవీ దారుణంగా పరాజయం పాలైంది. ఆ సినిమా కోసమని చెన్నైకి చెందిన “స్క్రీన్ సీన్ మీడియా” అనే సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ టైంలో నిర్మాత వాళ్ళతో 15 కోట్లకు ఒప్పందం చేసుకున్నాడు. వాళ్ళు 15 కోట్లు చెల్లించారు. ఐతే, సినిమా ఆడలేదు. వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిన ఎమౌంట్ లో పదిన్నర కోట్లు అలాగే బకాయి పడి ఉంది.

2020 ఫిబ్రవరిలో మధు మళ్లీ వారితో ఒప్పందం చేసుకున్నాడట. ఆ రోజునుంచి ఆర్నెళ్ళ లోపు లేదా “క్రాక్” సినిమా విడుదల లోపు, ఏది ముందు ఐతే అది, చెల్లించేలా అగ్రిమెంట్ జరిగింది. కానీ మధు ఆ పదిన్నర కోట్లు వారికి తిరిగి చెల్లించలేదు. దాంతో వారు మద్రాస్ కోర్టులో కేసు వేసి ఈ సినిమా విడుదలపై స్టే తెచ్చారు. ఈ గొడవ కొంతకాలంగా నడుస్తోంది. చివరి నిమిషం వరకు నిర్మాత నాన్చడంతో సినిమా మార్నింగ్ విడుదల కాలేదు. అలా రవితేజ పరువు పోయింది.

More

Related Stories