సంక్రాంతికి మొదటి సినిమా ఇదే

Krack

సంక్రాంతి వచ్చిందంటే రజనీకాంత్ సినిమాతోనే సందడి స్టార్ట్ అవుతుంది. గడిచిన రెండు మూడేళ్లుగా ఇదే చూస్తున్నాం. ముందుగా రజనీకాంత్ సినిమానే థియేటర్లలోకి వస్తుంది, ఆ తర్వాత మిగతా సినిమాలు క్యూ కడతాయి. అయితే ఈసారి రజనీకాంత్ స్థానాన్ని రవితేజ ఆక్రమించాడు.

అవును.. ఈ సంక్రాంతికి ముందుగా థియేటర్లలోకి వచ్చే సినిమా రవితేజదే. అతడు నటించిన ‘క్రాక్’ సినిమాను సంక్రాంతి బరిలో అన్ని సినిమాల కంటే ముందు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి 7 లేదా 8న ఈ సినిమా థియేటర్లలో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది.

కరోనా వల్ల థియేటర్లు అన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినా చాలా చోట్ల తెరుచుకోలేదు. అందుకే రవితేజ తన సినిమా ప్రచారం కోసం తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సెంటర్లలో పర్యటించాలని నిర్ణయించుకున్నాడట. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కోసం తను థియేటర్లకు వెళ్లాలని అనుకుంటున్నాడట.

చిన్న ఇంటర్వ్యూ ఇచ్చి చేతులు దులుపుకునే ఈ హీరో, పెద్ద నిర్ణయమే తీసుకున్నట్టు లెక్క. కాకపోతే రవితేజ నిజంగానే బయటకొస్తాడా రాడా అనేది తేలాల్సి ఉంది. సంక్రాంతికి ఇంకా 2 నెలల టైమ్ ఉంది. ఈ 60 రోజుల్లో రవితేజ మనసు ఎలా మారుతుందో చెప్పలేం కదా.

Related Stories