40 రోజుల్లో గుమ్మడికాయ!

- Advertisement -

పైకి కనిపించడు కానీ మేకింగ్ లో క్రిష్ చాలా స్పీడ్. గతంలో “గౌతమీపుత్ర శాతకర్ణి” లాంటి హిస్టారికల్ మూవీని చాలా స్పీడ్ గా పూర్తిచేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు మరో సినిమాను కేవలం 40 రోజుల్లోనే పూర్తిచేయబోతున్నాడు.

వైష్ణవ్ తేజ్, రకుల్ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా చేస్తున్నాడు క్రిష్. ఈ మూవీ షూటింగ్ ఒక్క సాంగ్ మినహా మొత్తం పూర్తయింది. మరో 4-5 రోజుల్లో ఆ పాటను కూడా పూర్తిచేసి, టోటల్ గా ప్యాకప్ చెప్పబోతున్నారు. అలా 40 రోజుల్లోనే ఇంకా పేరుపెట్టని ఈ సినిమా కంప్లీట్ అవుతోంది.

కరోనాను, భారీ వర్షాల్ని సైతం లెక్కచేయకుండా అతి తక్కువ రోజుల్లో ఈ సినిమాను పూర్తిచేస్తున్నారు. నిజానికి 40 రోజుల కంటే ఇంకాస్త ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేది. మధ్యలో డ్రగ్స్ కేసు విచారణ కోసం రకుల్, ముంబయి వెళ్లి రావడంతో సినిమా కాస్త ఆలస్యమైంది.

త్వరలోనే సినిమా టైటిల్ ను ప్రకటించి, ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. ఆ వెంటనే పవన్ కల్యాణ్ తో చేస్తున్న సినిమా వర్క్ స్టార్ట్ చేస్తాడు క్రిష్

 

More

Related Stories