డ్రగ్స్ పరీక్షకి క్రిష్ సిద్ధం!

- Advertisement -
Krish Jagarlamudi

మరోసారి డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని చుట్టుకొంది. ఈసారి మరో కొత్త డ్రగ్స్ కేసు. ఇటీవల హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో జరిగిన (ఇంతకుముందు అనేకసార్లు ఈ హోటల్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకొంది) పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగింది అని పోలీసులు గుర్తించారు. ఒక డ్రగ్ సప్లయర్ ని అరెస్ట్ చేశారు.

విచారణలో పలువురు పేర్లు వచ్చాయి. అందులో దర్శకుడు క్రిష్ పేరొకటి. డైరెక్టర్ క్రిష్ పేరు వెలుగులోకి రావడం ఒకింత ఆశ్చర్యపరిచింది. ఆ డైరెక్టర్ కి ఆ “ఇమేజ్” ఇప్పటివరకు లేదు. ఐతే డీసీపీ వినీత్ మీడియాకి చెప్పిన సమాచారం ప్రకారం పోలీసులు ఇప్పటికే క్రిష్ తో మాట్లాడారట. క్రిష్ విచారణకు సహకరిస్తానని చెప్పినట్లు డీసీపీ తెలిపారు.

తాను ఏ తప్పు చెయ్యలేదని, డ్రగ్స్ వినియోగించలేదు అని క్రిష్ పేర్కొన్నట్లు సమాచారం. ఐతే పోలీసులు అతన్ని డ్రగ్ పరీక్షకి సిద్ధంగా ఉండాలని అడిగారట. దానికి క్రిష్ అంగీకరించారు.

క్రిష్ ప్రస్తుతం అనుష్క హీరోయిన్ గా ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఆ షూటింగ్ లో ఉన్నారు. పోలీసులు జరిపే పరీక్షకు హాజరు కానున్నారు.

 

More

Related Stories