3 నెలల్లో సినిమా రెడీ

ఈసారి పక్కా ప్లానింగ్ తో దిగాడు క్రిష్. వైష్ణవ్ తేజ్ తో ఇలా సినిమా స్టార్ట్ చేసి అలా సెట్స్ పైకి వెళ్లాడు. 40 రోజుల సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమాను పూర్తి చేసి, 3 నెలల్లో ఫస్ట్ కాపీ రెడీ చేయాలనేది క్రిష్ టార్గెట్. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది.

మ్యాగ్జిమమ్ షూట్ మొత్తం ఈ అడవిలోనే కంప్లీట్ చేయబోతున్నారు. ఆ తర్వాత నల్లమలలో మరో 10 రోజుల షూట్ ఉంటుంది. దీంతో టోటల్ సినిమా షూట్ కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతానికి వైష్ణవ్ తేజ్ మాత్రమే సెట్స్ పైకి వచ్చాడు. వచ్చేనెల మొదటి వారం నుంచి రకుల్ అందుబాటులోకి వస్తుంది.

మరోవైపు ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా కీరవాణిని తీసుకున్నారు. సినిమాలో 2 పాటలు, ఒక మాంటేజ్ సాంగ్ మాత్రమే ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది.

2 నెలల్లో ఫస్ట్ కాపీ రెడీ చేసిన తర్వాత క్రిష్ ఈ సినిమాను, ఓటీటీకి ఇస్తాడా థియేటర్లలో రిలీజ్ చేస్తాడా అనేది చూడాలి. 

Related Stories