ఆ పాత్ర చెయ్యాలనేది కృష్ణ కోరిక


‘అల్లూరి సీతారామరాజు’ వంటి పాత్ర పోషించిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా తీయాలనుకున్నారు. ఛత్రపతి శివాజీ పాత్ర పోషించడం, ఆయన జీవితాన్ని తెరకెక్కించడం కృష్ణ డ్రీంగా ఉండేది. మూడు సార్లు ఆ సినిమా తీయాలని ప్రయత్నించారు కానీ కార్యరూపం దాల్చలేదు.

‘ఛత్రపతి శివాజీ’ సినిమాని సింహాసనం సినిమాకి మించి భారీగా తీయాలని ఆయన అనుకున్నారు. ఒకసారి ఓపెనింగ్ వరకు వచ్చింది వ్యవహారం. అయినా సెట్ పైకి వెళ్ళలేదు. ఆ పాత్ర పోషించాలన్న ఆయన కోరిక తీరలేదు.

డేరింగ్ గా నిర్ణయాలు తీసుకున్న కృష్ణ ఈ సినిమా విషయంలో మాత్రం ఎందుకో ముందుకు వెళ్లలేకపోయారు. బడ్జెట్ సమస్య ఐతే కాదు…. కానీ సరైన స్క్రిప్ట్ రెడీ కాలేదనేది ఒక మాట.

ఈ పాత్ర ఒక్కటే ఆయన తీరని కలగా మిగిలిపోయింది.

 

More

Related Stories