స్టెప్పేసిన ప్రభాస్, కృష్ణంరాజు!

Prabhas and Krishnam Raju

ప్రభాస్, రెబెల్ స్టార్ కృష్ణంరాజు… మళ్లీ కలిసి నటిస్తున్నారా? దీనికి సమాధానం అవును అనే చెప్పాలి. ‘రాధేశ్యామ్’లో కృష్ణంరాజు ఓ గెస్ట్ రోల్ లో దర్శనమిస్తారట. ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతున్నప్పుడు తండ్రీకొడుకులు కలిసి ఒక పాటకు స్టెప్పేశారు. ఆ ఫోటోని కృష్ణంరాజు షేర్ చేశారు. ప్రభాస్ కి కృష్ణంరాజు పెద్దనాన్న అవుతాడు.

కృష్ణంరాజు, ప్రభాస్ ఇంతకుముందు ‘రెబెల్’, ‘బిల్లా’ సినిమాల్లో కలిసి నటించారు. ‘రాధేశ్యామ్’ సినిమాతో కృష్ణంరాజు తాను నెలకొల్పిన ‘గోపికృష్ణ మూవీస్’ బ్యానర్ ని మళ్ళీ వెలుగులోకి తేవడం విశేషం. ఈ సినిమాకి ఆయన కూతురు ప్రసీద సహా నిర్మాత.

‘రాధేశ్యామ్’ జులై 30న విడుదల కానుంది. ఈ మూవీ బిజినెస్ పై కృష్ణంరాజు, ప్రభాస్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సినిమాకి బాగా ఖర్చు అయింది. దాంతో ఫైనాన్స్ వడ్డీలు బాగా పెరిగాయి. అవన్నీ పోవాలంటే.. సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీగా జరగాలి.

More

Related Stories