కృతి సనన్ బాటలోనే సిస్టర్ నుపుర్

Nupur Sanon

కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ లో మంచి పొజిషన్ లో స్థిరపడింది. టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉందిప్పుడు. ఆమె కెరీర్ తెలుగులోనే ప్రారంభం అయినా… సెటిల్ అయింది మాత్రం బాలీవుడ్ లోనే. ఇప్పుడు ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’లో కూడా నటిస్తోంది. మొత్తమ్మీద తన కెరీర్ పూర్తిగా సెటిల్ కావడంతో ఇప్పుడు సోదరిని హీరోయిన్ గా పరిచయం చేస్తోంది.

కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ ఇప్పటికే ఒక మ్యూజిక్ వీడియో ఆల్బమ్ లో బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ సరసన నటించింది. కానీ అది కేవలం ప్రైవేట్ సాంగ్. సినిమా హీరోయిన్ గా ఇంకా పరిచయం కాలేదు. తన చెల్లెలు హీరోయిన్ గా మంచి సినిమాలో ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది కృతి.

కృతి ప్రస్తుతం టైగర్ శ్రోప్ సరసన ఒక హిందీ మూవీ చేస్తోంది. ఇందులో మరో హీరోయిన్ కూడా నటించాలి. రెండో హీరోయిన్ పాత్రకు నుపుర్ ని అనుకుంటున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ కృతి ఆ వార్తలను తోసిపుచ్చింది. తన సిస్టర్ ని సోలో హీరోయిన్ మూవీలోనే పరిచయం చేస్తుందట.

అక్కా చెల్లెళ్ళు హీరోయిన్లుగా కొనసాగుతున్న ట్రెండ్ చాలా కాలంగా ఉంది. బాలీవుడ్ లో కరిష్మా కపూర్ బాటలో కరీనా వచ్చింది. పూజ భట్ ని చూసి అలియా భట్ అడుగు పెట్టింది.

 

More

Related Stories