సూర్య, కృతి మూవీ ఆగిపోలేదంట

- Advertisement -
Suriya and Krithi Shetty


బాలా… హీరో సూర్యకి గురువు. ‘శివపుత్రుడు’, ‘నందా’ వంటి సినిమాలతో సూర్య కెరీర్ ని నిలబెట్టారు బాలా. ఐతే, దర్శకుడిగా ఆయన ఇప్పుడు ఫామ్ లో లేరు. అందుకే, సూర్య తన గురువుని పిలిచి మరీ సినిమా ఆఫర్ ఇచ్చారు. ఇటీవలే ఆ సినిమా కన్యాకుమారిలో మొదలైంది.

ఐతే, తాజాగా కోలీవుడ్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యాక సూర్య ఈ సినిమాని పక్కన పెట్టాడు అనేది ఆ వార్త సారాంశం. ఈ సినిమా ఆగిపోయినట్లే అనేది ప్రచారం.

కానీ, అది అబద్దమని సూర్య టీం ప్రకటన విడుదల చేసింది. “34 రోజుల పాటు కన్యాకుమారిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం. వచ్చేనెలలో గోవాలో షూటింగ్ మొదలవుతుంది. అక్కడ సెట్ పనులు జరుగుతున్నాయి,” అని క్లారిటీ ఇచ్చింది. సూర్య, బాలాకి బేధాభిప్రాయాలు వచ్చాయన్న వార్తల్లో నిజం లేదన్నమాట.

ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. ఆమెకి ఇది మొదటి తమిళ చిత్రం. బాలా డైరెక్షన్లో నటిస్తే నటన వస్తుంది. ఆ విధంగా చూస్తే కృతికి ఈ సినిమా ముఖ్యం.

 

More

Related Stories