ఈ పిల్లకు అంత క్రేజుందా?

- Advertisement -
Krithi Shetty

కృతి శెట్టి నటించిన మొదటి సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ అప్పుడే నాని సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అలాగే, సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీలోనూ ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి సినిమా విడుదల కాకముందే రెండు సినిమాల్లో అవకాశాలు రావడం అంటే… మాటలు కాదు కదా.

ఆమె తొలి చిత్రం… ఉప్పెన. ఫిబ్రవరి 12న విడుదల కానుంది. ఐతే, ఈ భామని తమ సినిమాల్లో తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఆమె చెప్తున్న రేట్ విని వెనక్కి తగ్గుతున్నారట. మొదటి సినిమా రిలీజ్ కాకముందే అరకోటి అడుగుతోంది.

దాంతో ఆమెకి అంత సీనుందా? అని నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారట. ‘ఉప్పెన’ రిలీజ్ తర్వాత… ఆమెకి వచ్చే క్రేజ్ ని బట్టి చూద్దాం అని ఆగుతున్నారు.

 

More

Related Stories