రామ్ సరసన ‘కృతి శెట్టి’!

Krithi

రామ్ పోతినేని కొత్త సినిమా లాంచ్ చేశాడు. లింగుస్వామి డైరెక్షన్లో ఈ మూవీ మొదలైంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ లాంఛనంగా ఈ రోజు హైదరాబాద్ లో షురూ అయింది. త్వరలోనే రెగ్యులర్ షూట్. తమిళ్, తెలుగు భాషల్లో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకుంటారట.

కృతి శెట్టి ప్రస్తుతం ‘ఉప్పెన’ ప్రొమోషన్ తో బిజీగా ఉంది. ఆమె హైదరాబాద్ వచ్చాక… డేట్స్, పారితోషికం గురించి మాట్లాడి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్.

‘ఉప్పెన’ విడుదలకు ముందే ఈ అమ్మడు నాని సరసన నటించే ఛాన్స్ ని అందుకొంది. అలాగే సుధీర్ బాబు సరసన కూడా నటిస్తోంది. ఇప్పుడు రామ్ మూవీ కూడా ఫిక్స్ ఐతే… ఈ బ్యూటీ జాక్ పాట్ కొట్టినట్లే.

More

Related Stories