
కృతి శెట్టి ఒక ఉప్పెనలా తెలుగు సినిమా తెరపై విరుచుక పడింది. ఆమె క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయిపోయారు. వరుసగా ఆమె సినిమాలను హిట్ చేశారు. దాంతో, ఆమె కెరీర్ దూసుకుపోయింది. ఐతే, ఎంత స్పీడ్ గా ఆమె దూసుకొచ్చిందో అంతే వేగంగా వరుస ఫ్లాపులు పలకరించాయి. గతేడాది వరుసగా మూడు సినిమాలు (వారియర్, మాచర్ల నియోజకర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి) అపజయం పాలు కావడంతో ఆమె హవా తగ్గింది.
“అపజయాలకు భయపడను. అవి చిన్న ఆటంకాలుగా చూస్తాను. ఆ మూడు సినిమాల ఫలితం అలా ఉంటుంది అని ఊహించలేదు. కానీ వాటికి కుంగిపోవట్లేదు. భయపడకుండా ముందుకు వెళ్లడమే సరైన పని,” అని ఈ ముద్దుగుమ్మ చెప్తోంది.
ఆమె నటించిన కొత్త చిత్రం… ‘కస్టడీ’ ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఆమె ఇంతకుముందు నాగచైతన్య సరసన నటించిన ‘బంగార్రాజు’ మంచి విజయం సాధించింది. దాంతో, అదే సెంటిమెంట్ మరోసారి వర్కవుట్ అవుతుంది అనుకుంటోంది.
కృతి శెట్టి చేతిలో ఇప్పుడు ఒక మలయాళ చిత్రం, ఒక తమిళ చిత్రం ఉంది. తెలుగులో శర్వానంద్ తో ఒక సినిమా సెట్స్ పై ఉంది. కొత్తగా ఇంకా సినిమాలు సైన్ చెయ్యాలి.
ALSO CHECK: Stunning Krithi Shetty at Custody promotions