బాలీవుడ్ వెళ్లే ఆలోచన లేదు: కృతి

Krithi Shetty


వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ బిజీగా మారింది క్యూటీ కృతి. ఇటీవల విడుదలైన ‘వారియర్’ అపజయం చెందింది. కానీ, ఆమె సక్సెస్ రేట్ బాగుంది. అంతే కాదు, ఇప్పుడు తమిళంలో కూడా పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే సూర్య సరసన బాలా డైరెక్షన్లో నటిస్తోంది.

మరి తెలుగు, తమిళం తర్వాత నెక్స్ట్ స్టెప్పు బాలీవుడ్డే కదా. “అలాంటి ప్లాన్ లేదు. బాలీవుడ్ లో అవకాశాలు వచ్చిన మాట నిజం. కానీ ప్రస్తుతం ఆ ఆలోచన లేదు. తెలుగు, తమిళ్ పరిశ్రమల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ సినిమాలు చేయడమే నాకు ఇష్టం, ఆనందం,” అని చెప్పింది.

కృతి శెట్టి నటించిన కొత్త చిత్రం… ‘మాచర్ల నియోజక వర్గం’. నితిన్ సరసన నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. “మాచర్ల నియోజకవర్గంలో నేను స్వాతి అనే అమ్మాయిగా నటించాను. స్వాతి పాత్రలో చాలా షేడ్స్ వుంటాయి. సీన్ ని బట్టి ఒక్కో షేడ్ బయటికి వస్తుంది. కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత వుంటుంది,” అని సినిమా గురించి చెప్పింది కృతి శెట్టి.

ఇప్పుడు ఈ అమ్మడు డబ్బులు బాగా సంపాదిస్తోంది. మరి సేవాకార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? “అవును. ఎన్జీవో స్టార్ట్ చేయాలనే కోరిక ఉంది.”

తదుపరి చిత్రాలేంటి? “సూర్య హీరోగా తమిళంలో ఒక పెద్ద సినిమా. అలాగే నాగచైతన్యతో మరో సినిమా ఉంది,” అని తెలిపింది కృతి శెట్టి.

 

More

Related Stories