ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టిన కృతి

తెలుగు తెరపైకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చింది కృతి శెట్టి. ‘ఉప్పెన’ సినిమా సక్సెస్ తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. ఏ హీరోయిన్ కు అందని రేంజ్ లో అవకాశాలు అందిపుచ్చుకుంది. ఆమె నుంచి నెలకో సినిమా థియేటర్లలోకి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అయితే అలా వచ్చిన సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అవ్వడం, ఇప్పుడీ ముద్దుగుమ్మకు ఇబ్బందికరంగా మారింది.

హీరోకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులొచ్చినా పర్లేదు. మార్కెట్ తగ్గినా, అవకాశాలు తగ్గవు. అదే హీరోయిన్ కు వరుసగా ఫ్లాపులొస్తే మాత్రం అవకాశాలు ఇట్టే తగ్గిపోతాయి. అట్నుంచి అటు ఇంటికే. పాపం, హీరోయిన్ కృతి శెట్టికి ఇప్పుడు ఆ స్టేజ్ లోనే ఉంది. ఫ్లాపుల్లో ఆమె హ్యాట్రిక్ కొట్టింది.

‘మాచర్ల నియోజకవర్గం’, ‘వారియర్’ సినిమాలతో ఫ్లాప్స్ అందుకొంది ఈ బ్యూటీ. ఒకటి జులైలో విడుదలైతే, మరోటి ఆగస్టులో వచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్లో సుధీర్ బాబుతో కలిసి చేసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదలైంది. ఈ సినిమా కూడా ఫ్లాప్ దిశగా దూసుకుపోతోంది.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు సుధీర్ బాబుకు ఫ్లాప్స్ కొత్తకాదు. అతడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మరి కృతి శెట్టి పరిస్థితి ఏమౌతుందో చూడాలి. కాకపోతే, ఈ భామ చేతిలో నాగ చైతన్య చిత్రం, సూర్య హీరోగా తమిళంలో రూపొందుతున్న సినిమాలున్నాయి.

 

More

Related Stories