- Advertisement -

అందాల భామ కృతి శెట్టి ఇప్పటికే తెలుగులో అనేక చిత్రాలు లాగేసుకొంది. ఇప్పుడు తమిళంలో పెద్ద హీరో సరసన ఛాన్స్ కొట్టేసింది.
‘ఉప్పెన’ సినిమాతో కుర్రకారు మనసుని లాగేసుకున్న ఈ బ్యూటీ తమిళ సూపర్ స్టార్ సూర్య సరసన నటించనుంది. ‘శివపుత్రుడు’ దర్శకుడు బాలా సూర్య హీరోగా ఒక కొత్త సినిమా మొదలుపెడుతున్నారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కృతి శెట్టి ఎంపికైంది. ఆమెకిది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
‘ఉప్పెన’ తర్వాత ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలతో యావరేజ్ విజయాలు అందుకొంది. త్వరలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (సుధీర్ బాబు సరసన), ‘మాచర్ల నియోజక వర్గం’ (నితిన్ తో), ‘వారియర్’ (రామ్ సరసన) విడుదల కానున్నాయి. తెలుగులో ఇంత బిజీగా ఉంది.
ఇప్పుడు తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది.