కృతికి మందలింపు… అసలు కథేంటి?

Krithi Shetty


‘ఉప్పెన’ సినిమాతో పాపులర్ అయింది కృతి శెట్టి. దాంతో మూడు, నాలుగు సినిమాలు ఆమె ఖాతాలో పడ్డాయి. ఐతే, ఇటీవల ఆమె సరిగా నటించడం లేదని ఓ దర్శకుడు మందలించాడని పుకార్లు షికార్లు చేశాయి.

ఇంతకీ ఏమి జరిగింది అంటే…

రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. ఒక ఎమోషనల్ సీన్ తీస్తున్నప్పుడు కృతిశెట్టి తడపడింది. ఒక షాట్ కోసం అనేక టేకులు తీసుకొందట. దాంతో, లింగుస్వామి కొంచెం గట్టిగా మాట్లాడి సన్నివేశం మూడ్ లోకి వచ్చేలా చేశారు. ఆ తర్వాత ఆమె సర్దుకొంది… టేక్ ఓకే చేసింది.

ఎమోషనల్ సన్నివేశాల్లో నటించడం కొత్త నటులకు అంత సులువు కాదు. తడబాటు ఉంటుంది.

‘ఉప్పెన’ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశంలో బాగా నటించింది. ఐతే, ఇంకా నటనలో ఆమె రాటుదేలలేదు. ఇలాంటివి ప్రతి నటికి కామన్. కొన్ని సినిమాల అనుభవం తర్వాత సర్దుకుంటారు. కృతి అప్పుడే ‘సర్దుకొంది అని అంటున్నారు.

ప్రస్తుతం ఈ భామ ఇంద్రగంటి మోహన్ కృష్ణ తీస్తున్న ‘ఆ అమ్మయి గురించి మీకు చెప్పాలి’, నాని హీరోగా రూపొందిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాల్లో నటిస్తోంది.త్వరలోనే నితిన్ హీరోగా రూపొందే ఒక మూవీలోనూ, నాగ చైతన్య సరసన ‘బంగార్రాజు’ చిత్రంలో కూడా ఆమె నటించనుంది.

 

More

Related Stories