
కృతి శెట్టి తక్కువ టైంలోనే పాపులర్ అయింది. పాపం, తక్కువ టైంలోనే ఎక్కువ ఫ్లాపులు మూటగట్టుకొంది. తాజాగా విడుదలైన ‘కస్టడీ’ సినిమాతో ఆమె ఖాతాలో వరుసగా నాలుగో ఫ్లాప్ వచ్చి చేరింది. ఐతే, ఆమె ఉత్సాహం తగ్గలేదు. చేతిలో శర్వానంద్ 30వ చిత్రంతో పాటు తమిళ, మలయాళ చిత్రాలున్నాయి. అందుకే, కెరీర్ విషయంలో బాధపడడం లేదు.
మరోవైపు, ఈ భామ తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో ఇటీవల తెలిపింది. ఆమె కాబోయేవాడికి ఉండాల్సిన లక్షణాలివే….
- నవ్వించాలి. ఎప్పుడూ నవ్వుతుండాలి.
- డౌన్ టు ఎర్త్ ఉండాలి
- హుందాతనం చూపాలి.
- బలంగా ఉండాలి
- నిజాయితీ ముఖ్యం
కృతి శెట్టి వయసు ఇంకా 20 ఏళ్లే. అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చే టైంకి ఆమె అభిప్రాయాలు, కోరికలు, అంచనాలు మారొచ్చు.