
కృతి శెట్టి కూడా గ్లామర్ రూట్ లోకి వచ్చింది. “ఉప్పెన” పేరుతో పాపులర్ అయిన కృతి శెట్టి ఇప్పటివరకు పక్కింటి అమ్మాయిగానే అర డజన్ చిత్రాల్లో కనిపించింది. ఐతే ఇప్పుడు రెగ్యులర్ మసాలా సినిమాల్లో కనిపించే మాస్ హీరోయిన్ గా ఆకట్టుకోవాలనుకుంటోంది. అందుకే, ఆమె ఇప్పుడు గ్లామర్ రూట్ పట్టింది.
అందులో భాగంగా బెల్లీ డ్యాన్స్ లు ప్రాక్టీస్ చేస్తోంది.
ఆమె ఒక డ్యాన్సర్ తో కలిసి సొంతంగా బెల్లీ డ్యాన్స్ స్టెప్పులు కంపోజ్ చేసుకొని డ్యాన్స్ చేసింది. ఆ వీడియోని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. నల్ల జీన్స్ ప్యాంటు, ఎర్ర టాప్ లో ఆమె నడుము ఊపులు కుర్రకారుకి తెగ నచ్చాయి. వీటికి వేలల్లో లైకులు వచ్చాయి.
“బీస్ట్” సినిమాలోని అరబిక్ కుతు సాంగ్ కు బెల్లీ డాన్స్ చేసింది కృతి. డ్యాన్స్ చెయ్యడం ఇష్టం అని పేర్కొంది. “మొదటి కొరియోగ్రఫీ. బెల్లీ డ్యాన్స్,” అని క్యాప్సన్ రాసుకొంది.
Check Krithi Shetty’s belly dance video here.