ఏడేళ్ల తర్వాత తెలుగు హీరోతో

ఏడేళ్ల క్రితం మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత నాగ చైతన్యతో ‘దోచెయ్’ సినిమా చేసింది. మళ్ళీ ఇన్నేళ్లకు మరో తెలుగు స్టార్ తో యాక్ట్ చేస్తోంది కృతి సనన్. ఆమె ఇప్పుడు ‘ఆదిపురుష్’లో ప్రభాస్ కి జోడిగా సెలెక్ట్ అయింది. ఐతే, ఇది పూర్తిగా తెలుగు చిత్రం కాదు. బాలీవుడ్ మూవీగానే ప్రమోట్ చేస్తున్నారు.

కృతి సనన్ బాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉంది. “బరేలి కి బర్ఫీ”, “హౌస్ ఫుల్ 4” వంటి బాలీవుడ్ హిట్ సినిమాలున్నాయి. హిందీలో ఆమె బిజీ హీరోయిన్. కృతి తెలుగు వైపు మళ్ళీ చూపు వెయ్యలేదు. ఎందుకంటే తెలుగులో ఆమె నటించిన రెండు సినిమాలు అపజయాలే.

ప్రభాస్ సరసన ఛాన్స్ కావడంతో ఎగిరి గంతేసి ఒప్పుకొంది. ఈ సినిమాలో ఆమె సీతగా నటిస్తోంది. ఈ పాత్రకు ముందుగా అనుష్క శర్మ, కియారా అద్వానీని పరిశీలించారు. ఫైనల్ గా కృతిని ఈ పాత్ర వరించింది.

ఇకపై ఈ భామ ఇతర టాలీవుడ్ పెద్ద హీరోల సరసన సినిమాలు ఒప్పుకుంటుందా అన్నది చూడాలి.

More

Related Stories