అమ్మడి క్లారిఫికేషన్స్ ఎక్కువయ్యాయి!

ప్రభాస్, కృతి సనన్ మధ్య కుచ్ కుచ్ అంటూ ఆ మధ్య పుకార్లు చెలరేగాయి. వెంటనే కృతి సనన్ ‘ఖండించింది’. ఆ తర్వాత ప్రభాస్ కూడా అదంతా ఉత్తిదే అని చెప్పారు. బాలకృష్ణ టాక్ షోకి వెళ్ళినప్పుడు ప్రభాస్ కి కృతితో మేటర్ ఏంటనే ప్రశ్న ఎదురైంది. అప్పుడు కూడా ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు.

ఐతే ఉన్నట్టుండి, ఈ భామ మళ్ళీ వివరణల కార్యక్రమం మొదలుపెట్టింది. ప్రభాస్ – కృతి డేటింగ్ విషయం పాతబడింది. ప్రభాస్ వివరణతో అందరూ దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు కృతి మళ్ళీ ఎక్కువ క్లారిఫికేషన్లు ఇస్తుండడంతో వీరి విషయం మరోసారి హెడ్ లైన్స్ లోకి వచ్చింది.

ఆమె లేటెస్ట్ క్లారిఫికేషన్స్ అనేక డౌట్స్ వస్తున్నాయి. ప్రభాస్ ఈ మధ్య పిలిచి ఆమెని చివాట్లు పెట్టాడని కొందరు అంటున్నారు. అది కాదు, ‘ఆదిపురుష్’ ప్రమోషన్లు స్టార్ట్ కాకముందే ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఇస్తే మంచిది అని నిర్మాతలు చెప్పారట. తీరా ప్రొమోషన్ల టైములో సినిమా విషయం పక్కన పడి, ఈ డేటింగ్ ప్రశ్నలు ఎక్కువైతే సినిమా విషయం పక్కకి పోతుంది అని వారి భావించారట.

ఇందులో ఏది నిజమో తెలియదు కానీ ఆమె మళ్ళీ వీరి డేటింగ్ విషయాన్ని బయటికి తెచ్చింది.

Advertisement
 

More

Related Stories