అది పొందడమే నా డ్రీం: కృతి

కృతి సనన్ కి గ్లామర్ హీరోయిన్ అనే ఇమేజ్ ఉంది. సీరియస్ నటిగా ఆమెకింకా గుర్తింపు రాలేదు. నటన పరంగా ఇప్పటివరకు యావరేజ్ మార్కులు సంపాదించుకొంది. ఐతే, ఎప్పటికైనా నటిగా జాతీయ అవార్డు పొందుతాను అని ధీమాగా చెప్తోంది. ఆ లక్ష్యం దిశగా వెళ్తాను అంటోంది.

“నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ..జాతీయ అవార్డు పొందడం. అందుకోగలనని నమ్మకం ఉంది,” అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో ఎన్ని అవార్డులున్నా … జాతీయ అవార్దుకుండే గౌరవం వేరు. అందుకే, ఆమె ఆ టార్గెట్ పెట్టుకొంది.

మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ అందాల రాశి. ఇప్పుడు బాలీవుడ్ లో కంప్లీట్ గా సెటిల్ అయింది. ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’లో నటిస్తోంది కృతి సనన్.

More

Related Stories