
కృతి సనన్ నెలకు ఎంత రెంట్ కడుతుందో తెలుసా? అవును అక్షరాలా 10 లక్షల రూపాయలు. అది కూడా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి నెలకు పది లక్షల రూపాయలు ఇస్తుంది ఈ బ్యూటీ. ఎందుకంటే, అమితాబ్ కి చెందిన ఒక అపార్ట్మెంట్ ని ఆమె రెంట్ కి తీసుకొంది.
అమితాబ్ కి ముంబైలో అనేక ఫ్లాట్స్ ఉన్నాయి. వాటిని రెంట్ కి ఇచ్చారు. ముంబైలోని అంధేరి ప్రాంతంలోని అమితాబ్ కి చెందిన ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ కృతికి బాగా నచ్చిందట. దాంతో, 10 లక్షల రూపాయల రెంట్ కి ఓకే చెప్పి అందులోకి ఇటీవలే మకాం మార్చింది. నచ్చిన ఇల్లు కావడంతో అంట భారీ రెంటు ఇస్తోంది కృతి.
ఆమె ఇటీవలే ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’లో నటించింది. సీత పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ లో మంచి విజయాలతో దూసుకుపోతోంది ఈ భామ. సినిమాలు, బ్రాండ్లతో బాగా సంపాదిస్తోంది. సో… నెలకు 10 లక్షలు ఆమెకి పెద్ద లెక్క కాదు.