కృతి చెల్లెలు తెలుగులో బిజీ

Kritisanon Nupur

కృతి సనన్ హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం తెలుగులోనే. మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కడినే చిత్రం’తో ఆమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడ భారీ విజయాలు చూసింది. ఇప్పుడు అక్కడ అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఉంది కృత్ సనన్.

ఆమె సిస్టర్ నుపుర్ సనన్ కూడా అక్క బాటలోనే తెలుగులో నటిస్తోంది. ఆమె నటించిన మొదటి చిత్రం… టైగర్ నాగేశ్వరరావు. రవితేజ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రం ఈ దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే నుపుర్ రెండో చిత్రం సైన్ చేసింది.

మంచు విష్ణు కలల ప్రాజెక్ట్… కన్నప్ప. భక్తకన్నప్ప కథకి కొత్త రూపం ఈ “కన్నప్ప”. ఈ చిత్రం ఈ రోజు ప్రారంభం అయింది. ఇందులో హీరోయిన్ గా నుపుర్ నటిస్తోంది. ఈ రోజు ప్రారంభోత్సవానికి కూడా నుపుర్ వచ్చింది. అలా తక్కువ టైంలో రెండు తెలుగు సినిమాలు ఒప్పుకొంది నుపుర్.

మరి ఈ బ్యూటీ అక్క కృతిలా హిందీలో కూడా షైన్ అవుతుందా అనేది చూడాలి. తెలుగులో మాత్రం మంచి అవకాశాలు పొందుతోంది.

More

Related Stories