
కృతి సనన్ బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్. ఆమెకు ఉన్న క్రేజ్ కి, ఆమె ఇమేజ్ కి తగ్గ విజయం మాత్రం రావడం లేదు. ఇంకా చెప్పాలంటే వరుసగా ఫ్లాపులే.
కృతి సనన్ కొత్త సినిమా “తేరి బాతో మే ఐసా ఉల్జా జియా” (Teri Baaton Mein Aisa Uljha Jiya) తాజాగా విడుదలైంది. మొదటి వీకెండ్ ఈ సినిమాకి పాతిక కోట్లు రావడం గగనంగా ఉంది. షాహిద్ కపూర్, కృతి సనన్ కలిసి నటించిన ఈ సినిమాకి ఇంత తక్కువ ఓపెనింగ్ రావడంతో ఈ సినిమా ఫలితం ఏంటో ఇప్పటికే అర్థమైంది.
2024లో ఆమెకి ఇదే మొదటి సినిమా. గతేడాది ఆమె నటించిన మూడు చిత్రాలు (షెహజాద, ఆదిపురుష్, గణపత్) కూడా ఫ్లాప్ అయ్యాయి. ఈ చిత్రంతో వరుసగా నాలుగో ఫ్లాప్. ఆ మాటకొస్తే ఆమె అందుకున్న చివరి హిట్ 2021లో. వరుసగా మూడేళ్ళుగా అపజయాలే.
సినిమాకి 5 కోట్లపైనే తీసుకునే ఈ భామకి విజయాలు తగ్గిపోతుండడంతో క్రేజ్ కూడా పడిపోతుంది.