ఈ నెల 26న ‘క్షణ క్షణం’

రామ్ గోపాల్ వర్మ తీసిన క్లాసిక్స్ లో ‘క్షణ క్షణం’ ఒకటి. అదే పేరుతో ఒక థ్రిల్లర్ ని నిర్మించింది ‘మన మూవీస్’ సంస్థ. ‘ఆటగదరా శివ’ సినిమాలో హీరోగా నటించిన ఉదయ్ శంకర్ దీంట్లో కథానాయకుడు. ‘అర్జున్ రెడ్డి’లో కీలక పాత్ర పోషించిన జియా శర్మ హీరోయిన్.

కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో ఆద్యంతం ఉత్కంఠంగా సాగే ఈ మూవీ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను మెప్పిస్తుంది అంటున్నారు నిర్మాతలు డాక్టర్ వర్లు, మన్నం చంద్రమౌళి. సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ వచ్చింది. డార్క్ కామెడీ జానర్ లో సాగే ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది.

ఉదయ్ శంకర్, జియాశర్మ హీరోహీరోయిన్లుగా నటించే ఈ సినిమా లో శ్రుతిసింగ్, మ్యూజిక్ దర్శకుడు కోటి ,రఘుకుంచె , రవి ప్రకాశ్, గిఫ్టన్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

More

Related Stories