
అందాల ఆరబోత వల్లో, ఆమె అందమైన రూపం వల్లో, శ్రీదేవి కూతురు అనే కారణమో… మొత్తానికి జాన్వీ కపూర్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఆమెకి ఇప్పటివరకు బాలీవుడ్ లో భారీ హిట్ లేదు. ఓ మోస్తరు విజయాలు మాత్రమే ఉన్నాయి. అయినా పారితోషికం విషయంలో కానీ, ఉన్న క్రేజ్ కానీ ఆమె రేంజ్ టాప్. సినిమాకి 4, 5 కోట్లు తీసుకుంటుంది. అది ఆమె స్టార్డం.
ఇప్పుడు జాన్వీ కపూర్ తెలుగులో కూడా నటిస్తోంది. ఎన్టీఆర్ సరసన ‘దేవర’ అనే చిత్రంలో నటిస్తోంది జాన్వీ. మరోవైపు జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్ మొదటి చిత్రం విడుదల కాకముందే హల్చల్ చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటికే ఆమెకి మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఆమె తన బికినీ ఫోటోని షేర్ చెయ్యడంతో ఖుషి గురించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది.
శ్రీదేవి రెండో కూతురు… ఖుషి కపూర్. ఆమెలో పిన్ని మహేశ్వరి పోలికలు కనిపిస్తాయి. ఈ భామ బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ తీస్తున్న ‘ది ఆర్చీస్’ అనే సినిమాలో నటిస్తోంది. దీని ప్రమోషన్ ఇంకా మొదలు కాలేదు. కానీ అప్పుడే బికినీ ఫోటోలు షేర్ చేసి అందరి చూపు తన వైపు తిప్పుకొంది ఈ బ్యూటీ.
22 ఏళ్ళ ఖుషి కపూర్ ఇక రెండు, మూడు సినిమాలు చేశాక ఇంకా ఎంత క్రేజ్ తెచుకుంటుందో.