వాణిశ్రీ గురించి కుట్టి మాట!

- Advertisement -


తన అందంతో, అభినయంతో అలనాటి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అభినేత్రి వాణిశ్రీ. వందల చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు ఆమె. ‘దసరా బుల్లోడు’, ‘ప్రేమ్ నగర్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ఆమె ఇప్పుడు సినిమాల నుంచి రిటైర్ అయ్యారు. ఆమెకిప్పుడు 73 ఏళ్ళు. చెన్నైలో స్థిరపడ్డారు. ఇటీవల ఆమె కొడుకు ఆర్థిక ఇబ్బందులతో మరణించడం అందరిని షాక్ కి గురి చేసింది.

ఇక, వాణిశ్రీ గురించి ఇటీవల నటి కుట్టి పద్మిని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక ఒక తమిళ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుట్టి పద్మిని వాణిశ్రీ గురించి చెప్పినంక కొన్ని విషయాలు….

వాణిశ్రీ గారిని చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కలిశాను. ఆమె చాలా లావవడంతో ముందు గుర్తు పట్టలేదు. తర్వాత పలకరించాను. ‘ఏమే! అంత పెద్దదానివయ్యావా?’ అని నవ్వారు. ఫ్లైట్ డిలే అవడంతో చాలా సేపు మాట్లాడుతూ ఉన్నాం. నా గురించి, నా ఆస్తుల గురించి తను అడిగారు. పెద్దగా సంపాదించలేదనీ, ముగ్గురు కూతుళ్ల పేర మూడు ఫ్లాట్స్ రాశాననీ చెప్పాను.

‘అలా ఎందుకు? ఆస్తి కంట్రోల్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉండాలి. అప్పుడే పిల్లలు మన మాట వింటారు’ అని ఆమె అన్నారు. అది నా పద్ధతి కాదని తనకి చెప్పాను. నా పిల్లల మీద నాకు నమ్మకం ఉంది. నేను పోయాక ఆస్తి కోసం వాళ్లు గొడవలు పడటం నాకు ఇష్టం లేదు. అందుకే ముందే వాళ్లకు ఇవ్వగలిగినది ఇచ్చేశాను. వాణిశ్రీ గారి ఆలోచనలు వేరు.

అంత పెద్ద నటి, అంత స్టార్‌డమ్ చూసిన మనిషి ఈ 70 ఏళ్ల వయసులో కుటుంబాన్ని విడిచి ఒక్కత్తే ఎందుకు ఉంటున్నారో తెలియదు. ఆమెది పొగరు అనాలా? గర్వం అనాలా? అభద్రతా భావం అనాలా? ఆమె భర్త కరుణాకరన్ డాక్టర్. ఆమె ఇద్దరు పిల్లలూ (అభినయ వెంకటేశ కార్తీక్, అనుపమ) డాక్టర్లు. కార్తీక్ సౌత్ ఇండియాలోని అతి తక్కువమంది Sports Doctorsలో ఒకరు. అనుపమ కూడా పిట్యూటరీ గ్రంథికి సంబంధించిన అరుదైన వైద్యురాలు.

గతంలో సొంత అక్క చేతిలో ఆర్థికంగా మోసపోయిన వాణిశ్రీ గారు, ఆస్తిని మొత్తం తన అధీనంలో పెట్టుకున్నారు. భర్త, పిల్లల్ని కూడా నమ్మలేదు. కార్తీక్ కర్ణాటకలోని బడుగ జాతికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది నచ్చకో, మరెందుకో కానీ ఆ అమ్మాయి ముందే అతణ్ని ఆమె నానా మాటలు అనేవారు. అది అతనికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకసారి అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి చాలా బాధపడ్డాడు. అమ్మ తననీ, తన తండ్రినీ పోలీస్ స్టేషన్ వరకూ లాగిందని ఏడ్చాడు. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం ఫీజు కట్టనంటోందని బాధపడ్డాడు.

ఆ తర్వాత కర్ణాటక వెళ్లి ఎలాగో ఎంబీబీఎస్ పాసై ఉద్యోగంలో చేరాడు. అయితే లాక్‌డౌన్ టైంలో జీతం అందక చాలా ఇబ్బందులు పడి, డిప్రెషన్‌కు లోనై మరణించాడు. ఆ టైంలో అతని భార్య లండన్‌లో ఉంది. అతని చావు గురించి తెలియగానే నేను వాణిశ్రీ గారికి ఫోన్ చేశాను. “అవన్నీ నీకెందుకు? వేరే పని లేదా?” అని తిట్టి ఫోన్ పెట్టేశారు.

(KP TV – YouTube Channelలో నటి కుట్టి పద్మిని తమిళంలో చెప్పిన విషయాలు..)

సౌజన్యం: సాయి వంశీ

 

More

Related Stories