‘సీత’ పనుల్లో విజయేంద్రప్రసాద్

తెలుగువారికి విజయేంద్రప్రసాద్ గురించి పరిచయం అక్కర్లేదు. ఐతే, ‘బాహుబలి’తో ఆయన రైటర్ గా జాతీయస్థాయిలో పేరుతెచ్చుకున్నారు. ‘భజరంగి భాయ్ జాన్’, ‘బాహుబలి’, ‘మణికర్ణిక’ చిత్రాలతో ఆయన ఇప్పుడు బాలీవుడ్ లో అగ్ర రచయితగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన హిందీలో ‘సీత’ అనే సినిమా తీయనున్నారు. ‘రామాయణం’ కథని సీత పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే పౌరాణిక చిత్రం.

కథ, స్క్రీన్ ప్లేతో పాటు క్రేయేటివిటి పార్ట్ కి సంబందించిన పని అంతా ఆయనే చూసుకుంటారట. డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా డిసైడ్ కాలేదు. కరీనా కపూర్ సీతగా నటించనుందట. రణవీర్ సింగ్ ని రావణుడి పాత్రకి అడిగారట.

మరోవైపు, రాజమౌళి కూడా ‘మహాభారతం’ తెరకెక్కించాలని అనుకుంటున్నారు. అది తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పారు. విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ‘మహాభారతం’ కథని సినిమాకి తగ్గట్లు స్క్రిప్ట్ మలిచారని టాక్. ఐతే, ఈ ప్రాజెక్ట్ మరో ఐదేళ్ల తర్వాత పట్టాలెక్కుతోంది. ముందుగా రాజమౌళి మహేష్ బాబు మూవీ పూర్తి చెయ్యాలి.

Advertisement
 

More

Related Stories